వివేకా హత్యకు అసలు సూత్రధారులు సాక్షి యాజమాన్యమేనా?? – RRR

-

మాజీ మంత్రి వై.యస్. వివేకానంద రెడ్డి గారి హత్యకు సాక్షి యాజమాన్యమే అసలు సూత్రధారులా?, హత్యలో సాక్షి యాజమాన్యం భాగం పంచుకుందా?, హంతకులకు డబ్బు ఇచ్చింది సాక్షి యాజమాన్యమేనా?? అంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ గారు రాజు శర పరంపరగా ప్రశ్నాస్త్రాలను సంధించారు. వివేకానంద రెడ్డి గారి హంతకులకు 40 కోట్ల రూపాయలు ఇస్తానని ఒప్పందాన్ని కుదుర్చుకున్నది ఎవరన్నది విచారణకు వస్తుందనే ఇతరులపై నీలాప నిందలు వేస్తున్నారా? అంటూ ప్రశ్నించారు.

ఇకనుంచైనా దుష్ప్రచారాలకు దూరంగా ఉండాలని, ప్రజలు మనల్ని అనుమానిస్తారని తాను ఇటీవల చెప్పానని గుర్తు చేశారు. వివేకానంద రెడ్డి గారి హత్యకు సాక్షి యాజమాన్యం సూత్రధారులు కాకపోతే భుజాలు తడుముకోవాల్సిన అవసరం లేదన్నారు. తాజాగా రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణ రాజు గారు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అనుమానితుడిగా అభియోగాలను ఎదుర్కొంటున్న కడప ఎంపీ వై.యస్. అవినాష్ రెడ్డి గారికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ ను మంజూరు చేస్తే హెడ్లైన్ కథనంగా ప్రచురించిన సాక్షి దినపత్రిక అన్నారు.

అదే ముందస్తు బెయిల్ ను సుప్రీంకోర్టు రద్దు చేస్తే మాత్రం అసలు వార్తే ప్రచురించకపోవడం పత్రికా ధర్మమా? అంటూ సకల శాఖామంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని రఘురామకృష్ణ రాజు గారు ప్రశ్నించారు. వివేకానంద రెడ్డి గారిని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి గారు, బీటెక్ రవి గారు కలిసి హత్య చేశారని వార్తా కథనాలను సాక్షి దినపత్రిక వండి వారుస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వమే హత్య కేసును విచారణ చేసినప్పుడు వారిని అరెస్టు చేయకుండా ఏమి పీకారని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news