కాంగ్రెస్ తరపున షర్మిల ప్రచారం చేస్తారు – వైసీపీ ఎంపీ

-

 

తెలంగాణ ఎన్నికల బరి నుంచి తప్పుకుని, కాంగ్రెస్ పార్టీకి వైయస్సార్ టిపి అధ్యక్షురాలు షర్మిల సంపూర్ణ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో, ఎన్నికల ప్రచారంలో కూడా ఆమె పాల్గొనే ఛాన్స్ ఉందని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. ప్రచారంలో పాల్గొంటే ఆమె ఓటర్లపై కొంత ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని, అయితే ఏప్రిల్ లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయవద్దని ఆమె చెప్పకపోవచ్చునని అన్నారు.

జగనన్న విడిచిన బాణం ఆంధ్ర ప్రదేశ్ కు కూడా ప్రచారానికి వచ్చే అవకాశం ఉంటుందని, వై.యస్. రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత స్థానానికి ఎదిగారని, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గారి తనయుడు ఒక పార్టీ పెట్టుకున్నారని, కాంగ్రెస్ పార్టీలో ఆయన తనయకు సముచిత స్థానం ఇచ్చి, ఆమె భర్త అనిల్ ను కూడా రాష్ట్రంలోనూ ప్రచారం చేయించే అవకాశాలు లేకపోలేదని అన్నారు.

షర్మిల గారికి, బ్రదర్ అనిల్ గారికి మంచి ప్రజాదరణే ఉందని, జగన్ మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైన కాంట్రాక్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం జిల్లాలోని పాలేరు స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆయనకు జగన్ మోహన్ రెడ్డి గారు ఎన్నో కాంట్రాక్టులు కట్టబెట్టారని, దీంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారా? అన్న అనుమానాలు లేకపోలేదని అన్నారు. అన్నయ్యకు వ్యతిరేకంగా చెల్లెలు షర్మిల గారు పోరాడుతారా?? అన్న రకరకాల విశ్లేషణలు సోషల్ మీడియాలో కొనసాగుతున్నాయని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news