ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసించినందుకు దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ గారిపైకి పదిమంది మంత్రులను ఉసిగొలిపారని, రజినీకాంత్ గారిని తిట్టించడానికి వెచ్చించిన సమయం కూడా రైతుల బాగోగుల కోసం కేటాయించరా? జగన్ మోహన్ రెడ్డి గారు అంటూ రఘురామకృష్ణ రాజు గారు ప్రశ్నించారు.
ప్రజా సమస్యలను పరిష్కరించడానికి మంత్రులు సచివాలయంలో, తమ తమ ఆఫీసులలో అందుబాటులో ఉండరని, ప్రజా సమస్యలపై చర్చించడానికి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ నిర్వహణకు ఆసక్తిని ప్రదర్శించదని, ఇక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి ప్రజా సమస్యలే పట్టవని అన్నారు. ప్రజలను మభ్యపెట్టడానికి నటించే నటనలో 5వ శాతం నిజాయితీగా పని చేస్తే రైతు సమస్యలు పరిష్కారమవుతాయని, రైతులకు టీడీపీ ప్రభుత్వ హయాంలో చేసిన సహాయంలో నాలుగవ శాతం సహాయమైన ఈ నాలుగేళ్లలో జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేయలేదని, తమది రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూనే రైతులకు తాము చేసిందేమిటని రఘురామకృష్ణ రాజు గారు ప్రశ్నించారు.