షర్మిలకు ఎంపీ టికెట్ ఇవ్వొద్దని ఎవరైనా చెప్పారా?: ఎంపీ రఘురామ

-

ఎన్నికల సమయంలో షర్మిలను ఉపయోగించుకొని జగన్ వదిలేసారని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఇప్పుడు తమ కుటుంబంలో ఎవరో చిచ్చు పెడుతున్నారని జగనే అనడం దారుణమని మండిపడ్డారు. ‘చెల్లిని ఎన్నికల కోసం వాడుకుని….తర్వాత ఆమెకు ఆస్తి, ఎంపీ టికెట్ ఇవ్వద్దని ఎవరైనా చెప్పారా?… తప్పులన్నీ చేసింది, ప్రజల్ని మోసగించింది జగనే.

raghurama 

వైసీపీ ఓటమికి ఆయనే కారణమని తెలుసుకోకుండా ఇతరులపై రంకెలు వేస్తున్నారు’ అని దుయ్యబట్టారు.తల్లి, చెల్లితో సహా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ఏ ఒక్క మహిళను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు గౌరవంగా చూడడం లేదని, నిరాదరణకు గురి చేస్తున్నారని, ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి గారు ప్రేమగా చూసుకునేది ఆయన శ్రీమతి, కూతుర్లను మాత్రమేనని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. తల్లిని, చెల్లిని వెళ్ళగొట్టి నాకు ఎవరూ లేరు మొర్రో అని ఆయన అనడం ఆశ్చర్యంగా ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version