రాజకీయాలకు గుడ్‌ బై చెప్పనున్న రఘురామకృష్ణ రాజు ?

-

 

టీడీపీ, బీజేపీ పార్టీలలో ఇటీవల చేరిన వారు జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాటం మాట దేవుడెరుగు, కనీసం ఒక్క మాటైనా మాట్లాడినట్టు చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని తానేదో ఎమోషనల్ గా చెప్పిన విషయాన్ని ఇంటూరి రవికుమార్ అనే వ్యక్తి తాను రాజకీయాల నుంచి తప్పుకోనున్నట్లుగా, విచార వదనంతో ఉన్న ఫోటోను జోడించి తంబునెల్ తో వీడియో చేశారని రఘురామకృష్ణ రాజు తెలిపారు.

Raghuramakrishna Raju will say goodbye to politics

పేటీఎం కూలీలు ఎన్ని కారు కూతలు కూసినా తాను ప్రజాక్షేత్రంలోనే ఉంటానని, తనకు అలసట అన్నదే లేదని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు నిద్రపోయేది లేదని స్పష్టం చేశారు. కొంత మంది యూట్యూబర్లు నోటికొచ్చినట్లు మాట్లాడుతూ అవహేళన చేయాలని చూస్తే సహించేది లేదని ఒకరిద్దరి పేర్లను ప్రస్తావిస్తూ రఘురామకృష్ణ రాజు హెచ్చరించారు. రచ్చబండ కార్యక్రమాన్ని ఎక్కువగా మహిళలు తిలకిస్తుంటారని అందుకే తాను అసభ్య పదజాలాన్ని ఎప్పుడు ఉపయోగించడం లేదని చెప్పారు. ఎవరైనా నోటికొచ్చినట్లు మాట్లాడుతూ అవహేళన చేయాలని చూస్తే మాత్రం వారికి తగిన శాస్తి చేయనున్నట్లుగా వార్నింగ్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news