తెలంగాణ, ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్. నేటి నుంచి మూడు రోజులు వానలు పడనున్నాయి. రాజస్థాన్, జార్ఖండ్, బిహార్ మీదుగా బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

అయితే, బుధ, గురువారాల్లో కొన్ని ప్రాంతాల్లో తేమ, ఉక్కపోత వాతావరణం కొనసాగే అవకాశముందని పేర్కొంది. ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలకు అవకాశముందని తెలిపింది. ఇక అటు తెలంగాణ రాష్ట్రంలో కూడా నేటి నుంచి మూడు రోజులు వానలు పడనున్నాయి.