ఏపీ ప్రజలకు అలర్ట్..రెండు రోజుల పాటు ఏపీలో వర్షాలు కురుస్తాయి అంటోంది వాతావరణశాఖ. ఆగ్నేయ బంగాళాఖాతం….దానికి ఆనుకొని అండమాన్ సముద్రం…. శ్రీలంక సమీపాన నైరుతి బంగాళాఖాతంలో వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలు ఏర్పడ్డాయి. ఈ ప్రభావంతో ఇవాల్టి నుంచి తూర్పుగాలులు బలపడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇవాళ దక్షిణ కోస్తా, 21 నుంచి 23 వరకు కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.
రానున్న 24 గంటల్లో కోస్తా రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. మంగళ వారం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందన్నారు. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు… ఉరుములతో వానలు కురిసే చాన్స్ ఉందంటున్నారు.