పలు జిల్లాలో ఇవాళ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైయస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
కాగా, అసెంబ్లీ ఎన్నికల రాజకీయంతో వేడెక్కిన తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం రెండ్రోజులుగా చల్లబడింది. ఇక గురువారం రోజు ఏకంగా వర్షం కురిసింది. అయితే ఈ వర్షాలు మరో రెండ్రోజులు ఉండనున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వచ్చే రెండు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సగటున 0.3 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.