రైతు బంధు, డీఏ చెల్లింపు ప్రతిపాదనలను ఈసీకి పంపాం : వికాస్ రాజ్

-

తెలంగాణ శాసనసభ ఎన్నికల పోలింగ్​ ఏర్పాట్లను వేగవంతం చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ప్రస్తుతం ఇంటి నుంచే ఓటింగ్‌, ఫెసిలిటేషన్ కేంద్రాల్లో పోస్టల్ ఓటింగ్ జరుగుతోందని వెల్లడించారు. రాష్ట్రంలో మొదటిసారి మహిళా ఓటర్ల సంఖ్య  ఎక్కువగా ఉందని చెప్పారు. 14 లక్షలకుపైగా ముద్రణ పూర్తయిందనని వివరించారు.

మరోవైపు రైతు బంధు, డీఏ చెల్లింపులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పంపిన వివరణలను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపామని తెలిపారు. ఈసీ అనుమతికి ఎదురుచూస్తున్నట్లు వికాస్ రాజ్ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. 59,779 బ్యాలెట్ యూనిట్లు వాడుతున్నట్లు వివరించారు. ఇప్పటి వరకు 86 శాతం ఓటర్ సమాచార స్లిప్పుల పంపిణీ పూర్తయిందన్న ఆయన.. 49 చోట్ల ఓట్ల లెక్కింపు చేపడతామని పేర్కొన్నారు.

“ఈవీఎంలు తీసుకెళ్లే ప్రతి వాహనానికి జీపీఎస్ సౌకర్యం ఉంటుంది. ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న మొత్తం 669 కోట్లుగా తేలింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కింద 777 కేసులు నమోదు అయ్యాయి. అందులో 166 ప్రలోభాలకు సంబంధించి ఉన్నాయి. ఎన్నికల విధుల్లో దాదాపు పోలీసులు, కేంద్రబలగాలు కలిపి దాదాపు 70 వేల మంది విధుల్లో ఉంటాయి.” అని వికాస్ రాజ్ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news