ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఏపీకి తుఫాన్ ముప్పు… రాబోతుంది. బంగాళాఖాతంలో వాయుగుండంగా అల్పపీడనం మారబోతుంది. దీంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయట.అక్టోబర్ 24వ తేదీ, 25వ తేదీల్లో ముఖ్యంగా ఉత్తరాంధ్రకు అతి భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ అల్పపీడనం రేపు తుఫాన్గా బలపడనున్నట్లు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. కాబట్టి ఉత్తరాంధ్ర ప్రజలు అసలు బయటికి వెళ్లకూడదని కూడా సూచించింది. ఎల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వర్షాలు పడతాయని కూడా తెలిపింది.