విజయవాడ ప్రజలకు మరో ఎదురు దెబ్బ. రాత్రి నుంచి విజయవాడ మహానగరంలో మళ్లీ వర్షం ప్రారంభమైంది. మంగళవారం రాత్రి నుంచి మోస్తారుగా వర్షం పడుతోందని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ వర్షం కారణంగా సహాయ చర్యలు చేయలేకపోతున్నారు అధికారులు. అటు బుడమేరు కాస్త శాంతించిందని చెప్పవచ్చు. సింగనగర్ వైపు తరలివచ్చిన శివారు కాలనీ.. ప్రజలకు కూడా ప్రభుత్వం సహాయం అందిస్తోంది.
అయితే ఇలాంటి నేపథ్యంలో వర్షం పడడం అధికారులకు భారీ అడ్డంకి గా మారింది. ఇలాగే వర్షం కొనసాగితే… సహాయక చర్యలు మరింత లేట్ అవుతాయని చెబుతున్నారు అధికారులు. అటు విజయవాడ నెమ్మదిగా కోరుకుంటుంది. వరద ప్రభావం తగ్గడంతో…. ఇప్పుడిప్పుడే జనాలు బయటకు వస్తున్నారు. అటు చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు విజయవాడ పరిస్థితిలను సమీక్షిస్తున్నారు.