మంత్రి పెద్దిరెడ్డికి బిగ్ షాక్ ఇచ్చారు రాజంపేట ఎంపి అభ్యర్థి, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి. పుంగనూరులో సీఈసీ పర్యవేక్షణలో ఎన్నికలు జరపాలని..ఈసీకి రాజంపేట ఎంపి అభ్యర్థి, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేశారు. పెద్దిరెడ్డి అరాచకాలతో ఓటర్లు భయపడుతున్నారని లేఖలో పేర్కొన్నారు.
ఈ మేరకు ఈసీకి రాజంపేట ఎంపి అభ్యర్థి, మాజీ సీఎం కిరణ్ ఫిర్యాదు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘానికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. మంత్రి పెద్దిరెడ్డి వ్యవహారాలు ఎన్నికల కమిషన్ ను సవాలు చేసే విధంగా ఉన్నాయని వివరించారు. మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ వి థున్ రెడ్డి, వారి కుటుంబీకులు తీవ్ర స్థాయిలో హింసను ప్రేరేపిస్తున్నారని ఆగ్రహించారు. పుంగనూరు నియోజక వర్గాన్ని పూర్తిగా ఎన్నికల కమిషన్ తన ఆధీనంలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు కిరణ్ కుమార్ రెడ్డి.