BREAKING: తెలంగాణ చెరుకు రైతులకు శుభవార్త..చక్కెర ఫ్యాక్టరీలపై కీలక ప్రకటన

-

BREAKING: తెలంగాణ చెరుకు రైతులకు శుభవార్త అందించింది. తెలంగాణ రాష్ట్రంలో మూత పడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీలు త్వరలోనే తెరుచుకోనున్నాయి. అధికారం చేపట్టినప్పటి నుంచి నాలుగు నెలలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు కొలిక్కివచ్చాయి. చక్కెర ఫ్యాక్టరీలకు సంబంధించిన పాత బకాయిలను వన్ టైమ్ సెటిల్మెంట్ కింద చెల్లించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్లతో సంప్రదింపులు జరిపింది.

Good news for Telangana sugarcane farmers

అందుకు బ్యాంకర్లు సమ్మతించటంతో ఫ్యాక్టరీల బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. వన్ టైమ్ సెటిల్మెంట్ కింద పాత బకాయిలు మొత్తం రూ.43 కోట్లు విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే మూతపడ్డ చక్కెర పరిశ్రమలను తెరిపించేందుకు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. మూతపడ్డ చక్కెర పరిశ్రమల పునరుద్ధరణకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సారధ్యంలో జనవరిలోనే మంత్రి వర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది.వన్ టైమ్ సెటిల్మెంట్ కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.43 కోట్లను విడుదల చేయటంతో త్వరలోనే మూత పడ్డ చక్కెర ఫ్యాక్టరీలు తెరిచేందుకు మార్గం సుగమమైంది.

Read more RELATED
Recommended to you

Latest news