ఏపీని.. ఆరోగ్యాంధ్ర ప్రదేశ్‌ గా మార్చుతా – మంత్రి విడదల రజినీ

-

ఆంధ్ర ప్రదేశ్‌ ను.. ఆరోగ్యాంధ్ర ప్రదేశ్‌ గా మార్చుతానని ప్రకటన చేశారు ఏపీ కొత్త వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజినీ. ఇవాళ వైద్యారోగ్య శాఖ బాధ్యతలు స్వీకరించిన మంత్రి విడదల రజనీ…మీడియాతో మాట్లాడారు.వైద్యారోగ్య శాఖకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని… మెడికల్ సర్వీసెస్ విషయంలో ఏపీ ఐకాన్ గా నిలుస్తోందని వెల్లడించారు.

ఏపీలో అందుతున్న వైద్య సేవల పట్ల కేంద్రం నుంచి ప్రశంసలు అందాయన్నారు. 16 మెడికల్ కాలేజీలు త్వరలో ఏర్పాటు కాబోతున్నాయని ప్రకటన చేశారు. ప్రతి పార్లమెంట్ పరిధిలో మెడికల్ కాలేజీలు రాబోతున్నాయని.. వచ్చే నెలాఖరులోపు అన్ని మెడికల్ కాలేజీల నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్నాయని స్పష్టం చేశారు.

వైద్యారోగ్య శాఖలో నాడు-నేడు పాలసీ ద్వారా ఆస్పత్రులను అభివృద్ధి చేస్తున్నామని.. రాష్ట్రంలో మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చరును సమకూరుస్తోందని వెల్లడించారు. టెలీ మెడిసిన్ సర్వీసెస్.. హెల్త్ సెంటర్ల ఏర్పాటు కూడా చేస్తున్నామని.. పేదలకు వైద్యం అందించే విషయంలో సీఎం ఎక్కడా రాజీ పడడం లేదని తెలిపారు. ఆరోగ్య శ్రీ ద్వారా పేదలకు వైద్య సేవలందిస్తున్నామని పేర్కొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version