కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు అరుదైన గౌరవం దక్కింది. దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న 2వ ఆసియా-పసిఫిక్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ లో సభ్య దేశాల ఛైర్మన్ ఎన్నిక బుధవారం నిర్వహించారు. ఇందులో ఏపీఎంసీ చైర్మన్ గా కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ను సింగపూర్ దేశం ప్రత్తిపాదించగా భూటాన్ దేశం మద్దత్తు తో ఆయా దేశాల ప్రతినిధులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశం తరఫున దక్కిన ఈ గౌరవాన్ని బాధ్యతగా స్వీకరిస్తానని తెలిపారు. విమానయాన రంగాన్ని ప్రజలకు మరింతగా అందుబాటులోకి తీసుకు రావడంతో పాటు సభ్య దేశాల మధ్య రవాణాను సులభతరం చేసేందుకు తనవంతు కృషి చేస్తానని వెల్లడించారు. ఆకాశ మార్గాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు సభ్య దేశాలన్నీ ఉమ్మడిగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు.