హాట్ టాపిక్: విశాఖ రాజధానికి రామోజీ సూచించే కొత్త పేరు!!

-

ఆంధ్రప్రదేశ్ కు కొత్త రాజధానిని గుంటూరు సమీపంలో నిర్మించాలని గతంలో చంద్రబాబు & కో నిర్ణయించిన సమయంలో… రాజధానికి ఏ పేరు పెడితే బాగుంటుందనే చర్చ రాష్ట్రవ్యాప్తంగా బలంగా నడిచింది. ఆ సమయంలో రాజధాని పేరుపై అనేక ప్రతిపాదనలు కూడా వచ్చాయి. మొదట్లో ఏపీ రాజధానికి “ఎన్టీఆర్” పేరు పెడతారని టాక్ వచ్చింది. అంతే కాదు.. రాజధాని ప్రాంతంలోని బిల్డింగులను పైనుంచి నుంచి చూస్తే “NTR” అనే అక్షరాలు వచ్చేలా రూపొందించాలని కూడా భావించినట్టు అప్పట్లో అనేక కథనాలు వెలువడ్డాయి. వాటన్నింటికీ చెక్ పెడుతూ “అమరావతి” అని ఫైనల్ చేశారు.

ఈ విషయంలో… ఏపీ రాజధాని కోసం అనేక పేర్లు పరిశీలించిన తర్వాత ఫైనల్ గా అమరావతి పేరునే ఫైనల్ చేశామని.. ఈ పేరు చాలా బావుండటంతోపాటు.. చారిత్రక నేపథ్యం కూడా ఉండటంతో ఫైనల్ చేశామని నాటి ప్రభుత్వం చెప్పుకొచ్చింది. అయితే.. ఆ పేరును “ఈనాడు” ప్రధాన సంపాదకుడు రామోజీరావు ప్రతిపాదించారని స్వయంగా చంద్రబాబు వెల్లడించారు. రామోజీరావు అమరావతి పేరు సూచించడమేకాకుండా.. దాని వెనుక ఉన్న చరిత్ర, తదితర వివరాలు తనకు పంపించారని చంద్రబాబు అప్పట్లో వెల్లడించారు కూడా! అయితే… అది గతం!!

ఇప్పుడు జగన్ ప్రభుత్వం వచ్చింది.. ప్రణాళికలు, ప్రతిపాదనలు అన్నీ మరిపోయాయి. ఏపీ రాజధాని విశాఖకు వెళ్లబోతుంది అంటూ జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన తేవడం.. అసెంబ్లీ ఆమోదించడం.. జగన్ తన పని తాను చేసుకుపోవడం వేగంగా జరిగిపోతుంది. ఈ క్రమంలో గతంలో లాగా… ఏపీ నూతన రాజధానుల్లో ఒకటైన, ప్రధానమైన “పరిపాలనా రాజధాని”కి రామోజీ ఏమైనా పేరు ప్రతిపాదిస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

చంద్రబాబు చెప్పినా, తాను చెప్పినా, ఎవరు చెప్పినా ప్రస్తుతం జగన్ వినే పరిస్థితి లేదు కాబట్టి… తాను గతంలో లాగా అడగకుండానే.. ఒక సీనియర్ మోస్ట్ పత్రికాధిపదిగా, ప్రధాన సంపాదకుడిగా.. అడ్మినిస్ట్రేట్వి క్యాపిటల్ కు ఒక పేరు ప్రతిపాదిస్తారా.. ఆ మేరకు “ఈనాడు” లో ఒక ఎడిటోరియల్ రాయగలరా అన్నది ఇక్కడ పెద్ద ప్రశ్న. బాబు అంటే తాను చెప్పినట్లు వింటారు కాబట్టి సూచించొచ్చు కానీ… అక్కడ ఉన్నది జగన్ కాబట్టి.. తీరా ప్రతిపాదించాక, జగన్ అది కాదన్నాక అభాసుపాలవడంకంటే.. నామకరణం అయిపోయిన తర్వాత బ్యానర్ ఐటం వేస్తే సరిపోతుందని సరిపెట్టుకుంటారా అన్నది వేచి చూడాలి!!

Read more RELATED
Recommended to you

Latest news