ఆర్టీసీలో డ్రైవర్లు, కొత్త నియామకాలు చేపడతాం – ఏపీ మంత్రి రాం ప్రసాద్ రెడ్డి

-

ఆర్టీసీలో డ్రైవర్లు, కొత్త నియామకాలు చేపడతామని ఏపీ రవాణా శాఖా మంత్రి రాం ప్రసాద్ రెడ్డి ప్రకటించారు. ఇవాళ మీడియాతో ఏపీ రవాణా శాఖా మంత్రి రాం ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ… అక్రమంగా కేటాయించిన ఆర్టీసీ ఆస్తులను రద్దు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్లపాటు ప్రజల రక్త మాంసాలు తినిందంటూ ఫైర్‌ అయ్యారు.

Ramprasad Reddy

ఆర్టీసీ బస్సులు సహా స్టాఫ్ పెరగాల్సిన అవసరం ఉంది….గత ప్రభుత్వం కార్మిక సంఘాలను ఛిన్నాబిన్నాం చేసిందని మండిపడ్డారు. ఆర్టీసీ ఉద్యోగులు, ప్రయాణి కులు మాకు రెండు కళ్లు….ఉద్యోగులకు మంచి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆర్టీసీలో కొత్తగా డ్రైవర్లు సహా సిబ్బందిని నియామకాలకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

ఆడుదాం ఆంధ్ర పేరిట గతప్రభుత్వంలో కొందరు పందికొక్కుల్లా తిన్నారు….డబ్బులు తిన్న వారిపై విచారణ జరుపుతామని వెల్లడించారు. అక్రమార్కులను ఊచలు లెక్కపెట్టిస్తామని… గత ప్రభుత్వంలో క్రీడల పేరిట నేతలు తిన్న డబ్బంతా కక్కిస్తామని హెచ్చరించారు. ప్రతి దానికీ అకౌంటబులిటీ,తో పారదర్శకంగా పరిపాలన చేస్తామని హామీ ఇచ్చారు ఏపీ రవాణా శాఖా మంత్రి రాం ప్రసాద్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news