తిరుమలలో ఇవాళ రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం వచ్చింది. హుండి ద్వారా భక్తులు కోటి 2 లక్షల రూపాయలు సమర్పించినట్టు పరకామణిలో తేలింది. కరోనా కలకలం వలన శ్రీవారి ఆలయానికి భక్తులని నిలిపివేశారు. దాదాపు నెలల తరువాత మళ్ళీ ఓపెన్ చేశారు. అలా ఓపెన్ చేసినా చాలా పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తున్నారు. ఇక శ్రీవారి ఆలయంలో దర్శనాలు పునరుద్ధరణ చేసిన తరువాత ఇదే అత్యధిక ఆదాయం అబూ చెబుతున్నారు.
ఇక దర్శనాల విషయంలో కూడా నిన్న రికార్డు సృష్టించిందని చెప్పచ్చు. ఎందుకంటే నిన్న రికార్డు స్థాయిలో శ్రీవారిని 13486 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక తిరుమల బ్రహ్మోత్సవాల సమయంలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల కోటాను టీటీడీ విడుదల చేయనుంది. ఇప్పటికే సెప్టెంబర్ మాసం కోట విడుదల చేసినప్పటికీ బ్రహ్మోత్సవాల కారణంగా ఈ నెల 15వ తేదీతో పాటు 18 నుంచి 27వ తేదీ వరకు టికెట్లను టీటీడీ హోల్డ్ లో ఉంచింది. రేపటి నుంచి ఈ పన్నెండు రోజులకు సంబంధించిన టిక్కెట్లను టీటీడీ భక్తులకు అందుబాటులో వుంచే అవకాశం ఉందని అంటున్నారు.