Red Alert at Rajahmundry Airport on Independence Day: తూర్పు గోదావరి జిల్లా కలకలం నెలకొంది. తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి విమానాశ్రయంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవం సంద ర్భంగా రాజమండ్రి విమానాశ్రయంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. ఈ నెల 20వ తేదీ వరకు పూర్తిగా విమానాశ్రయంలో రక్షణ విషయంలో అప్రమత్తం చేస్తూ ఆదేశాలు జారీ చేశారు అధికారులు.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2024/08/Red-Alert-at-Rajahmundry-Airport-on-Independence-Day.jpeg)
సందర్శకుల అనుమతి రద్దు చేస్తూ రాకపోకలు సాగించేవారిపై పూర్తి స్థాయిలో నిఘా పెడుతున్నారు. వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించాకే ముఖద్వారం నుంచి లోపలికి అనుమతి ఇస్తున్నారు. విమానాశ్రయం శివారు చుట్టూ 9 వాచ్ టవర్ల ద్వారా 24 గంటలు రక్షణ సిబ్బందిని ఏర్పాటు చేసి పహారా ఏర్పాటు చేసింది సర్కార్.