నేను సీఎంగా ఉంటే జిల్లాలను కలిపేవాడిని: కిరణ్‌కుమార్‌రెడ్డి

-

మాజీ సీఎం, బీజేపీ నేత కిరణ్‌ కుమార్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏపీ ముఖ్యమంత్రిగా ఉంటే జిల్లాలను మళ్లీ కలిపే వాడినని అన్నారు. గత సర్కార్ జిల్లాలు విభజించి తప్పు చేసిందని తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి బాధ్యతలు చేపట్టడం సంతోషకరమని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. నదీ జలాల సమస్య పరిష్కారం కావాలంటే బ్రిజేష్‌కుమార్‌ను తప్పించాలని.. బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ తీర్పుపై నేను స్టే తెచ్చి 11 ఏళ్లు అవుతోందని గుర్తు చేశారు. నదీ జలాల అంశంలో అప్రమత్తం కాకుంటే రాయలసీమకు అన్యాయం జరుగుతుందని తెలిపారు.

అయితే సమర్థుడైన చంద్రబాబు ముందు చాలా సవాళ్లు ఉన్నాయని కిరణ్ కుమార్ పేర్కొన్నారు. కేంద్రం సాయంతో సమస్యలను పరిష్కరించాలని సూచించారు. రాజధాని, పోలవరం ప్రాజెక్టులను పూర్తి చేయాలని చెప్పారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని కిరణ్ కుమార్ అన్నారు. వాటి పర్యవసానమే ఇప్పుడు కొన్ని సంఘటనలు జరుగుతున్నాయని తెలిపారు. గత ప్రభుత్వం జిల్లాలు విభజించి తప్పు చేసిందన్న ఆయన తాను సీఎంగా ఉండి ఉంటే మళ్లీ జిల్లాలను కలిపేవాడినని వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news