విజయవాడ అయిపోయింది..ఇక విశాఖలో దంచికొడుతున్న భారీ వర్షం

-

విజయవాడ అయిపోయింది..ఇక విశాఖలో దంచికొడుతోంది భారీ వర్షం. ఇవాళ మధ్యాహ్నం నుంచి ఉమ్మడి విశాఖలో భారీ వర్షం దంచికొడుతోంది. అటు విశాఖ నగరంలో కుండపోతగా వర్షం కురుస్తోంది. దీంతో వాహనాదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. అటు విశాఖ పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. దీంతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు అధికారులు చెబుతున్నారు.

red alert for these districts in ap

పాత బిల్డింగ్ ల వద్ద ఉండొద్దని అధికారులు సూచనలు చేస్తున్నారు. పలు చోట్ల విద్యుత్ సరఫరా కు అంతరాయం ఏర్పడింది. వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న 24 గంటల్లో అతి భారీ వర్షాలు ఉన్నట్లు తెలిపింది. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన రెడ్ అలర్ట్ జారీ చేసింది. విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, యానాం లకు భార ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news