తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ పాలకమండలి శుభవార్త చెప్పింది. ప్రస్తుతం ఉన్న కరుణ అంశాలను తొలగించి భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకునే లా చర్యలు తీసుకుంటున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై వి సుబ్బారెడ్డి మీడియాకు వెల్లడించారు.
చెన్నైలోని టీటీడీ స్థానిక సలహా మండలి సభ్యులు పదవి విరమణ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. త్వరలోనే ఆంక్షలను తొలగిస్తామని.. నెల రోజుల్లో సాధారణమైన దర్శన ప్రక్రియ మొదలవుతుందని స్పష్టం చేశారు వై వి సుబ్బారెడ్డి. సర్వదర్శనం అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటన చేశారు.
తమిళనాడు మరియు పుదుచ్చేరి నుంచి కాలినడకన వస్తున్న భక్తుల సంక్షేమం కోసం పలు చర్యలు తీసుకుంటున్నామని చెన్నైలో ఆలయ నిర్మాణానికి సంబంధించి త్వరలోనే తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ తో సమావేశం అవుతామని స్పష్టం చేశారు. ఇప్పటికే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం చెన్నైలో రెండు చోట్ల భూములు ఇచ్చిందని వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు.