ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు YSR పేరు తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది చంద్రబాబు కూటమి సర్కార్. గత వైఎస్ జగన్ ప్రభుత్వం 2023-24లో ప్రారంభించిన ఐదు, 2024-25లో ప్రారంభించాలని నిర్ణయించిన మరో 5 కాలేజీలకు పెట్టిన YSR పేరును తొలగిస్తూ వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది.
అలాగే పలాసలోని కిడ్నీ రీసెర్చి సెంటర్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పేరును మార్చేసింది చంద్రబాబు కూటమి సర్కార్. అటు కడపలోని క్యాన్సర్ ఆస్పత్రులకూ YSR పేరును తొలగించి…సంచలన నిర్ణయం తీసుకుంది చంద్రబాబు కూటమి సర్కార్. దీనిపై వైసీపీ పార్టీ నేతలు సీరియస్ అవుతున్నారు.