మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు.. సీఎం జగన్‌ కు RGV ప్రశ్న

-

మంత్రి రోజాపై టిడిపి సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి వాక్యాలపై డైరెక్టర్ ఆర్జీవి వరుస ట్వీట్లు చేస్తున్నారు. తాజాగా వైసిపి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. ‘మహిళా మంత్రి అయిన రోజాపై అనుచిత వాక్యాలు చేసిన బండారు సత్యనారాయణపై చర్యలు తీసుకోకపోతే… సామాన్య మహిళలకు ఎలాంటి రక్షణ కల్పిస్తారు?’ అని సీఎం జగన్ ను ట్యాగ్ చేస్తూ ప్రశ్నించారు.

RGV's question to CM Jagan
RGV’s question to CM Jagan

శ్రీమతి వాసిరెడ్డి పద్మగారు, నాకు తెలియక అడుగుతాను, తెలుగుదేశం పార్టీ లోని ఒక బండారు సత్యనారాయణ అనే ఒకడు ప్రస్తుత టూరిజం మంత్రి రోజాగారిని, ఆవిడ డబ్బులు కోసం అందరితో పడుకుంటుందని , బ్లూఫిల్మ్స్ లో act చేస్తుందని ఆ బ్లూ ఫిల్మ్స్ తన దగ్గర ఉన్నాయని ,పబ్లిక్ మైక్లో అరుస్తుంటే ఇంతకన్నా స్త్రీలని అవమానించడం ఇంకేముంటుంది??? 1.08 సెకండ్స్ నించి 2.26 సెకండ్స్ వరకు video చూడండి అంటూ మరో ట్వీట్‌ లో పేర్కొన్నారు రాం గోపాల్ వర్మ.

https://x.com/RGVzoomin/status/1707772929738777019?s=20

Read more RELATED
Recommended to you

Latest news