‘సెక్స్ సమ్మతి వయసు 18ఏళ్లే.. ఇంకా తగ్గించొద్దు’ : లా కమిషన్ కీలక సిఫార్సు

-

చట్టం ద్వారా యుక్త వయసులో ఉన్న వారి మధ్య లైంగిక సంబంధాన్ని నిర్వచించే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. బాలబాలికలు లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనే వయస్సును 18 నుంచి 16 ఏళ్లకు తగ్గించాలని ఇప్పటికే పలు కోర్టులు సూచించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ వ్యవహారంపై లా కమిషన్ క్లారిటీ ఇచ్చింది. పోక్సో చట్టం ప్రకారం ఇద్దరు వ్యక్తుల మధ్య లైంగిక సంబంధం విషయంలో కీలక సూచనలు చేసింది. అదేంటంటే..?

లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడానికి అంగీకారం తెలిపే కనీస వయసు 18సంవత్సరాల నుంచి 16 ఏళ్లకు తగ్గించాలనే వాదనను లా కమిషన్​ తీవ్రంగా వ్యతిరేకించింది. సమ్మతి వయసు 16ఏళ్లకు మార్చడం సరికాదని లా కమిషన్‌ స్పష్టం చేసింది. 16ఏళ్లకు తగ్గిస్తే.. బాల్యవివాహాలు, పిల్లల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని లా కమిషన్‌ నివేదించింది. 16-18 ఏళ్ల పిల్లలకు సంబంధించిన లైంగిక వేధింపులు, లైంగిక దాడుల కేసుల్లో వారు సమ్మతి తెలియజేస్తే….అది కౌమార దశలోని అనియంత్రిత ప్రేమనా? లేదా క్రిమినల్‌ ఉద్దేశాలు ఉన్నాయా అని గుర్తించడంపై కోర్టులు అప్రమత్తంగా వ్యవహరించాలని లా కమిషన్‌ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news