బండారు సత్యనారాయణ వ్యాఖ్యలపై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తప్పులకు జైల్లో ఉంటే… ఆ టాపిక్ నుంచీ డైవర్ట్ చేయడానికి నన్ను టార్గెట్ చేసారని ఫైర్ అయ్యారు. బండారు సత్యనారాయణ లాంటి చీడపురుగులకు శిక్ష పడాలి.. మహిళలు అందరం కలిసి పోరాడతామని పిలుపునిచ్చారు.
నాలాంటి వారికే ఇలాంటి పరిస్ధితి అయితే… సాధారణ స్త్రీల పరిస్ధితి ఏంటి.. అన్నారు. నేను దీనిని వదిలేది లేదు… క్రిమినల్ డెఫర్మేషన్ వేస్తా… సుప్రీంకోర్టు వరకూ వెళతానని ప్రకటించారు రోజా. టిడిపి జనసేన దిగజారుడు వీడియోలు అందరికీ తెలుసు… జనసేన, టిడిపి చేసే పనులు ప్రజలు చూస్తున్నారని వివరించారు రోజా.
Asian Games లో సిల్వర్ మెడల్ సాధించిన సాకేత్ మైనేని కి మంత్రి రోజాతో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. సాకేత్ చాలా అదృష్టవంతుడు…సక్సెస్ అయిన వారు ఎవరూ పూలబాటలో రాలేదన్నారు. టెన్నిస్ చాలా ఖర్చుతో కూడుకున్న క్రీడ… 12 సంవత్సరాలుగా సాకేత్ పతకాలు సాధిస్తున్నారని వెల్లడించారు. 9 సంవత్సరాల గ్యాప్ తరువాత కూడా సిల్వర్ సాధించారని కొనియాడారు. ఏషియన్ గేమ్స్ లో 107 పతకాలు మన దేశానికి వచ్చాయని పేర్కొన్నారు. మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు అధిక పతకాలు సాధించారని కొనియాడారు.