2024…జగనన్న వన్స్‌ మోర్‌ అంటూ కబడ్డీ ఆడిన రోజా

-

2024…జగనన్న వన్స్‌ మోర్‌ అంటూ కబడ్డీ ఆడారు మంత్రి రోజా. ఇవాళ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ముగియనుంది. ఈ తరుణంలోనే..కబడ్డీ ఆడిన రోజా..అందరినీ కనువిందు చేశారు. ఇక అనంతరం మంత్రి రోజా మీడియాతో మాట్లాడారు.

టైమ్ పాస్ రాజకీయలు చేస్తోందంటూ షర్మిలపై రోజా ఫైర్‌ అయ్యారు. షర్మిల మాట్లాడే ప్రతి మాట కూడా చంద్రబాబు స్క్రిప్ట్ ఏనని చురకలు అంటించారు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టి కాంగ్రెస్ లో విలీనం చేసి ఇప్పుడు ఏపీ లో టైమ్ పాస్ రాజకీయాలు చేయడానికి వచ్చిందని మండిపడ్డారు. వైఎస్సార్ పంచెలు ఉడాదీసి కొడతా అన్నా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి పెళ్లికి ఆహ్వానం ఇచ్చిందని ఆగ్రహించారు.

టీడీపీ కోవర్ట్‌ అన్న రేవంత్ రెడ్డి తో ఏ మొహం పెట్టుకొని పొత్తు పెట్టుకుందని ఫైర్‌ అయ్యారు.వినే వాడు వెర్రి వాడు అయితే చెప్పే వాడు షర్మిల అన్నట్లు గా మారింది షర్మిల పరిస్థితి అని.. షర్మిల కు అసలు ఏం గుర్తింపు ఉంది? ఒక్క రాజశేఖర్ రెడ్డి బిడ్డ అనే గుర్తింపు తప్ప అంటూ మండిపడ్డారు రోజా. ప్రతి పక్షాలు దుమ్మెత్తి పోయడం విమర్శలు చేయడం తప్ప ఇంకేం చేస్తున్నాయని…కులం, మతం, ప్రాంతం అనే తేడా చూడకుండా అభివృద్ధి చేస్తున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news