15 రోజుల రిమాండ్ తరువాత పోలీసు కస్టడీకి ఇవ్వడానికి వీలు లేదు !

-

చంద్రబాబు నాయుడు గారు సహకరించడం లేదని, పోలీస్ కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టును అడిగామని పీపీ వివేకానంద అనే అధికారి పేర్కొన్నట్లుగా టీవీలలో చూడడం జరిగిందని, అయితే చట్టంలోనే కొన్ని రూలింగ్ క్లారిఫికేషన్ ఉన్నాయని గతంలో సుప్రీం కోర్టు స్పష్టం చేసినట్లు రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు. ఒకసారి 15 రోజులపాటు జ్యూడిషియల్ రిమాండ్ కు ఇచ్చిన తరువాత పోలీసు కస్టడీకి ఇవ్వడానికి వీలు లేదని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయని అన్నారు.

మొదట అయితే మొత్తం పోలీసు కస్టడీకి ఇవ్వవచ్చునని, చంద్రబాబు నాయుడు గారి కేసులో రెండు రోజులకు మించి పోలీసు కస్టడీ ఇవ్వడానికి లేదని తాను రచ్చబండలో చెప్పానని, అదే జరిగిందని అన్నారు. అయినా వివేకానంద అనే అధికారి పోలీస్ కస్టడీ కోసం కోరామని, మళ్లీ చంద్రబాబు గారిని విచారిస్తామని చెప్పినట్లుగా టీవీలో చూశానని, జ్యుడీషియల్ రిమాండ్ ను పొడిగించవచ్చు… కానీ పోలీసు కస్టడీ ఇవ్వడానికి నిబంధనలు అంగీకరించవని అన్నారు. చార్జి షీట్ వేయకపోతే 90 రోజుల పాటు జైలులోనే ఉండాల్సి వస్తుందని, అయినా ఈ కేసులో చంద్రబాబు నాయుడు గారికి బుధవారము నాడు ఖచ్చితంగా బెయిల్ లభిస్తుందని అన్నారు.

చంద్రబాబు నాయుడు గారిని పోలీసు కస్టడీకి ఇవ్వడం జరగదని తాను చదివిన న్యాయ పరిజ్ఞానం చెబుతోందని, 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీ ముగిసిన తర్వాత మళ్లీ పోలీసు కస్టడికి ఇవ్వరని తనకు తెలుసునని, అయినా చట్టంలో ఏమైనా సవరణలు జరిగాయేమో అంటూ రఘురామకృష్ణ రాజు గారు పేర్కొన్నారు. ఇక్కడ అప్లికబుల్ కాదా అన్నది చెప్పలేనని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version