ఏపీలో అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. సోమవారం ఉదయం ఏపీ శాసనమండలిలో అధికార,ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. సోషల్ మీడియాలో పోస్టుల గురించి ఏపీ సర్కార్ ప్రతిపక్షంపై ప్రశ్నల వర్షం కురిపించగా..శాంతిభద్రతలపై ప్రతిపక్ష వైసీపీ పార్టీ కూటమి ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టింది.
ఈ క్రమంలోనే ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత, మాజీ మంత్రి, శాసన మండలి సభ్యుడు బొత్స సత్యనారాయణ మధ్య వాదనలు జరిగాయి. సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల గురించి సమాధానం చెప్పాలని ప్రభుత్వం డిమాండ్ చేయగా.. శాంతి భద్రతలు(అత్యాచారాలు) గురించి ముందుగా సమాధానం చెప్పాలని వైఎస్సార్ససీపీ పట్టుబట్టింది. లేకపోతే సభ నుంచి వాకౌట్ చేస్తామని బొత్స సత్యనారాయణ ప్రకటించడంతో సభలో గందరగోళం నెలకొంది.