విశాఖపట్నంలో 500 కోట్ల ప్రజాధనంతో చిన్న ఇంటిని నిర్మించుకున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అంగన్వాడి, ఆశా వర్కర్లు తమ జీతాలను పెంచమంటే పెంచరా? అని రఘురామకృష్ణ రాజు గారు ప్రశ్నించారు. అంగన్వాడి, ఆశా వర్కర్ల డిమాండ్ సహితుకమైనదేనని, పొరుగు రాష్ట్రాలలో అంగన్వాడి, ఆశా వర్కర్లకు ఇస్తున్నంతగా తమకు కూడా జీతాలు ఇవ్వాలని వారు కోరుతున్నారని అన్నారు.
అందరి పిల్లలని తమ సొంత పిల్లల్లా చూసుకునే అంగన్వాడీలు, మహిళలు, బాలింతల బాగోగులను పట్టించుకునే ఆశా వర్కర్లకు 17 వేలు కాకపోతే 18వేల రూపాయల జీతాన్ని కోరుకుంటే తప్పేముందని అన్నారు. ఇందులో సింహభాగం కేంద్ర ప్రభుత్వమే నిధులను మంజూరు చేస్తుందని, అవసరమైతే జీతాలను పెంచిన తరువాత, కేంద్ర ప్రభుత్వాన్ని నిధులను పెంచమని కోరుదాం అని అన్నారు. పెరిగిన ఖర్చుల నేపథ్యంలో జీతాలను పెంచకపోతే వారి జీవితం దుర్భరం అవుతుందని, మున్సిపాలిటీ సిబ్బంది కూడా తమను రెగ్యులరైజ్ చేసి జీతాలను పెంచాలని సమ్మె చేస్తున్నారని తెలిపారు.