పులివెందులలో నిర్వహించిన బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని రఘురామకృష్ణ రాజు అన్నారు. కదిరి, అనంతపురంలో నిర్వహించిన బహిరంగ సభలలోను అదే సీన్ రిపీట్ అయిందని, రాత్రి 10 గంటల వరకు కూడా ప్రజలు వేచి చూసి చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఆయన ప్రసంగాన్ని ఓపికతో విన్నారని అన్నారు. పెయిడ్ బ్యాచ్ మీటింగులు ఎలా ఉంటాయో జగన్ మోహన్ రెడ్డి గారి సభలను చూస్తే అర్థం అవుతుందని, జగన్ మోహన్ రెడ్డి గారి సభకు హాజరైన వాళ్లు గోడలు దూకి ఎలా పారిపోయారో అందరూ చూశారని, పులివెందుల బహిరంగ సభలో వివేకానంద రెడ్డి గారి హత్య గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన విధానం చూస్తే మా పార్టీ గోచీలు ఊడిపోవడం ఖాయం అనుకున్నామని అన్నారు.
కదిరి బహిరంగ సభ చూసిన తర్వాత సీమ ప్రజల్లో వచ్చిన విప్లవం, ఈ ప్రభుత్వంపై ప్రజల తిరుగుబాటు మొదలైనట్లు స్పష్టమయ్యిందని, చంద్రబాబు నాయుడు గారిని ముసలి వాడని అంటున్నారని, ఆయన్ని ముసలివాడు అనడం ఏమిటి… ఇరిగేషన్ ఇంజనీర్, ప్రొఫెసర్ మాదిరిగా ప్రతిరోజు సాగునీటి ప్రాజెక్టులను సందర్శిస్తూ, గతంలో తాను చేసిన అభివృద్ధి ఏమిటి?, చేయాలనుకున్న అభివృద్ధి ఏమిటన్నది వివరిస్తూ, ఈ ప్రభుత్వ హయాంలో సాగునీటి ప్రాజెక్టులు ఎలా నిర్లక్ష్యానికి గురవుతున్నాయో వివరిస్తున్నారని అన్నారు. సాయంత్రం బహిరంగ సభలలో పాల్గొంటూ, మరుసటి రోజు ఉదయాన్నే ఆరు గంటలకు రెడీ అయి ప్రాజెక్టుల సందర్శనకు బయలుదేరి వెళుతున్న చంద్రబాబు నాయుడు గారిని ముసలివాడన్న వారు ఇంట్లో నుంచి బయట కాలు కూడా పెట్టడం లేదని రఘురామకృష్ణ రాజు గారు ఎద్దేవా చేశారు. ఈ తరహా వెదవ కామెంట్లు చేసేవారు చంద్రబాబు నాయుడు గారి పనితీరును చూసి బుద్ధి తెచ్చుకోవాలన్నారు.