ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలిలో గోదావరి ఏటిగట్టు పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. జగన్ ఐదేళ్ల పాలనలో ఇరిగేషన్ శాఖను విధ్వంసం చేసి కనీస మెయింటెన్స్ పనులు కూడా పట్టించుకోకపోవడంతో ఏటిగట్లు బలహీన పడి ప్రమాదంగా మారాయి. రాష్ట్రంలో ఇరిగేషన్ అత్యవసర పనులు నిమిత్తం చంద్రబాబు మంజూరు చేసిన రూ.320 కోట్ల నిధుల పనులను మార్చి నెలాఖరులోపు పూర్తి చేయాలి.
జగన్ పాలనలో గోదావరి ఏటిగట్టుకు ఒక్కరూపాయి ఖర్చు చేయకపోవడంతో వరదలు వస్తే.. ప్రజలు, యువకులు కలిసి రాత్రిళ్లు సైతం పని చేసి ఏటి గట్లను కాపాడుకున్నారని మంత్రి తెలిపారు. జగన్ నిర్లక్ష్యం చేసిన ఏటి గట్లను బలోపేతం చేయడం, డ్రైన్ల పూడిక పనులు, గేట్లు, షట్టర్లు, లాకులు, రోప్ లు వంటి అత్యవసర పనులను సరి చేస్తున్నామని మంత్రి రామా నాయుడు తెలిపారు. నాడు ఇరిగేషన్ శాఖలో 12 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల ప్రమోషన్లకు ఆమోద ముద్ర వేస్తూ ఉద్యోగుల గౌరవాన్ని కాపాడుతున్నామన్నారు.