ఎమ్మెల్యే కడియం శ్రీహరికి మాజీ ఎమ్మెల్యే రాజయ్య సవాల్..!

-

తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎంల ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల వేళ.. ఆరోపణలు, ప్రత్యారోపణలతో స్టేషన్ ఘనపూర్ లో పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. 13 నెలల్లో నియోజకవర్గానికి ఏం చేశావని ఎమ్మెల్యే కడియం శ్రీహరికి మాజీ ఎమ్మెల్యే రాజయ్య సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత రూ.1000 కోట్ల నిధులు తెచ్చానని ఎమ్మెల్యే కడియం కౌంటర్ ఇచ్చారు.

మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కడియం శ్రీహరి పై తీవ్ర వ్యాక్యలు చేశారు. కడియం కక్ష సాధింపు చర్యలు, కుట్ర రాజకీయాలు చేస్తున్నారు. టీడీపీలో ఉన్నప్పుడు అక్రమ కేసులు, అక్రమ నిర్భంధాలు చేశారని దుయ్యబట్టారు. దౌర్జన్యాలు చేస్తూ ఎందరినో ఎన్ కౌంటర్లు చేయించారు. ఈ ఆరు నెలల్లో ఏడుగురి పై అక్రమ కేసులు పెట్టించాడు. స్టేషన్ ఘనపూర్ ప్రజలను నమ్మించి మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేసారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేస్తాడని కడియంను గెలిపించారని పేర్కొన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news