BREAKING : ఏపీలో ఆర్టీఐ కమిషనర్ల వేతనాలు భారీగా పెరిగాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీఐ కమిషనర్ల వేతనాలను పెంచుతూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది జగన్ మోహన్ రెడ్డి సర్కార్. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాతో సమానంగా ఆర్టీఐ కమిషనర్లకు వేతనం ఇస్తున్నట్లు ప్రకటించింది సర్కార్.
ఐదేళ్ల పాటు పదవీలో ఉంటే సమాచార కమిషనరుకు నెలకు రూ. 2.25 లక్షల వేతనం ఇస్తున్నట్లు నివేదికలో పేర్కొంది. అఖిల భారత సర్వీసు అధికారులకు చెల్లించినట్టుగానే డాఏ, సీసీఏ చెల్లింపులు , ఆర్జిత సెలవులు ఉంటాయని స్పష్టీకరణ చేసింది ఏపీ ప్రభుత్వం.
ప్రభుత్వం అందించే ఉచిత వసతి లేదా , మూల వేతనంలో 24 శాతం మొత్తాన్ని హెచ్ఆర్ఏ గా చెల్లించనున్నట్టు జీవోలో వెల్లడించింది. సొంత ఇంటిలో నివాసం ఉన్నప్పటికీ హెచ్ఆర్ఏను క్లెయిం చేసుకోవచ్చని స్పష్టీకరణ చేసింది. వాహనానికి నెలకు రూ. 60 వేలు, టెలిఫోనుకు రూ. 5 వేలు చెల్లించనున్నట్టు పేర్కోంది ఏపీ ప్రభుత్వం.