తిరుమలలో సర్వదర్శనానికి 20 గంటలు

-

తిరుమల శ్రీవారి ఆలయానికి భారీగా భక్తులు పోటెత్తుతున్నారు. వేసవి సెలవులు ముగుస్తుండటంతో కుటుంబంతో కలిసి తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీగా రద్దీ నెలకొంటుంది. దీంతో స్వామి వారి దర్శనానికి సాధారణం కంటే ఎక్కువ సమయం పడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి ఆదివారం కూడా భక్తుల రద్దీ కొనసాగింది. ఎటువంటి దర్శన టికెట్లు లేకుండా తిరుమల వచ్చిన భక్తులతో సాయంత్రానికి క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి షెడ్లన్నీ నిండిపోయాయి. ఆపై టీబీసీ వరకూ క్యూ లైన్‌లో భక్తులు వేచి ఉన్నారు.

వీరికి దాదాపు 20 గంటల్లో దర్శనం లభించిందని టీటీడీ తెలిపింది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులు 5 కంపార్టుమెంట్లల్లో వేచి ఉన్నారని వెల్లడించింది. వీరిని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-01 కంపార్టుమెంట్ల నుంచి దర్శనానికి పంపుతుండగా.. 3 గంటల సమయం పడుతోందని పేర్కొంది. శనివారం శ్రీవారిని 78,686 మంది భక్తులు దర్శించుకున్నారు. రూ.3.54 కోట్ల హుండీ కానుకలు లభించాయి.

Read more RELATED
Recommended to you

Latest news