జాబిల్లి రెండోవైపు దిగిన చైనా వ్యోమనౌక చాంగే-6

-

చంద్రమండల యాత్రల్లో చైనా మరో ముందడుగు వేసింది. జాబిల్లి దక్షిణ ధృవం రెండోవైపున ఈ దేశానికి చెందిన చాంగే-6 వ్యోమనౌక ఆదివారం విజయవంతంగా దిగింది. సౌత్‌ పోల్‌-అయిట్కిన్‌ బేసిన్‌లో అది సురక్షితంగా ఉపరితలాన్ని తాకినట్లు చైనా అంతరిక్ష పరిశోధన సంస్థ (సీఎన్‌ఎస్‌ఏ) ప్రకటించింది. అక్కడి నమూనాలను సేకరించిన తర్వాత ఇది తిరిగి భూమికి బయల్దేరనున్నట్లు తెలిపింది.  ఈ మిషన్‌లో ఆర్బిటర్, ల్యాండర్, అసెండర్, రిటర్నర్‌ అనే నాలుగు భాగాలు ఉన్నాయి.

వివిధ దశలను అధిగమించి జాబిల్లి కక్ష్యను చేరింది. గత నెల 30న ఆర్బిటర్‌-రిటర్నర్‌ మిశ్రమం నుంచి ల్యాండర్‌-అసెండర్‌ వేరైంది. తాజాగా అది సౌత్‌ పోల్‌-అయిట్కిన్‌ బేసిన్‌లో ఉన్న అపోలో బేసిన్‌లో దిగింది. చందమామకు సంబంధించిన ఒక భాగం మాత్రమే భూమి నుంచి కనిపిస్తుంది. ఇవతలి భాగం (నియర్‌ సైడ్‌)గా దాన్ని పేర్కొంటారు. రెండో పార్శ్యాన్ని ఫార్‌ సైడ్‌గా పిలుస్తారు. ఆ భాగం నుంచి చందమామ నమూనాల సేకరణకు పూనుకోవడం ఇదే మొదటిసారి. డ్రిల్లింగ్‌ యంత్రాన్ని ఉపయోగించి ఉపరితలానికి దిగువనున్న ప్రాంతం నుంచి మట్టిని తీసుకుంటుంది. అనంతరం భూమికి తిరిగి వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news