ఇటీవల ఏపీ సర్కారు పై తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం టీచర్లపై కేసులు పెట్టి లోపల వేయిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. కానీ తెలంగాణలో ఐదేళ్లలో ఉపాధ్యాయులకు 73% ఫిట్మెంట్ ఇచ్చామని వివరించారు. అలాగే ఏపీ సీఎం జగన్ లాగా కేంద్రం షరతులకు ఒప్పుకొని ఉంటే.. ఏటా ఆరువేల కోట్లు అప్పులు తీసుకుని మరిన్ని పథకాలు ప్రవేశపెట్టే వారమని చెప్పారు. అయితే హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ..
వారి రాష్ట్ర విషయాలను వారు చూసుకుంటే బాగుంటుందని అన్నారు. ఈ వ్యాఖ్యలపై తాము స్పందిస్తే మరింత రచ్చ కావడం మినహ మరే ఉపయోగముండదని అన్నారు. ఉపాధ్యాయులతో తమ ప్రభుత్వం మంచిగా వ్యవహరిస్తుందని.. వారికి ఇప్పటికీ ఏమైనా సమస్యలు ఉంటే చర్చలు జరపడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. హరీష్ రావు ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు సజ్జల .