కొడాలి-వంశీ మౌనదీక్ష..?

-

ఇటీవల కాలంలో ఏపీలో రాజకీయ పరిణామాలు ఊహించని విధంగా మారుతూ వస్తున్నాయి. అనూహ్యంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుని వైఎస్సార్ యూనివర్సిటీగా మార్చడంతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున రాజకీయ యుద్ధం జరుగుతుంది. వైసీపీ-టీడీపీల మధ్య మాటల యుద్ధం కూడా నడుస్తోంది. ఇదే క్రమంలో గతంలో ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని, అలాగే టీడీపీని బలవంతంగా లాక్కున్నారని, అసలు ఎన్టీఆర్‌పై జగన్‌కే ప్రేమ ఉందని వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు.

ఇటు టీడీపీ వాళ్ళు ఎలాగో..ఎన్టీఆర్ పేరు మార్పుపై తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తున్నారు..అసలు ఎన్టీఆర్-వైఎస్సార్‌కు పోలిక ఏంటి అని ఫైర్ అవుతున్నారు. అలాగే వైఎస్సార్‌కు జగన్ వెన్నుపోటు పొడిచారని, కాంగ్రెస్ పార్టీని మోసం చేశారని..ఇలా జగన్‌పై టీడీపీ విరుచుకుపడుతుంది. ఇదే సమయంలో ఫ్యామిలీలని కూడా బయటకు లాగి విమర్శలు చేసుకునే పరిస్తితి కనిపిస్తోంది. మరి నీచంగా రెండు పార్టీలు తిట్టుకుంటున్నాయి.

అయితే పేరు మార్పుపై ఒకో నేత ఒకో విధంగా స్పందిస్తున్నారు. ఎవరికి వారు..తమకు కావల్సిన పార్టీలని సమర్ధించుకుంటున్నారు. ఇదిలా ఉంటే అనూహ్యంగా జగన్ వీరాభిమానులుగా ఉంటూ..ఎన్టీఆర్ తమ ఆరాధ్య దైవం అని చెప్పుకునే కొడాలి నాని, వల్లభనేని వంశీలు మాత్రం ఈ విషయంలో పెద్దగా మాట్లాడటం లేదు. పేరు మార్చిన మొదట రోజు..వంశీ స్పందించారు. ఎన్టీఆర్ పేరు మార్చడం కరెక్ట్ కాదని సూచించారు.

ఇంకా అంతే మళ్ళీ వంశీ దానిపై మాట్లాడలేదు..తన పని తాను చేసుకుంటూ వెళుతున్నారు. ఇక ఎన్టీఆర్ పేరుతోనే గుడివాడలో రాజకీయం చేసే కొడాలి నాని సైతం ..ఈ అంశంపై ఇంతవరకు స్పందించలేదు. అసలు మీడియా ముందుకొస్తే చాలు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు అంటూ..తెగ బూతులు తిట్టేవారు. అలాంటిది ఎన్టీఆర్ పేరు మార్పుపై ఎలా స్పందించాలో తెలియక ఆగిపోయినట్లు ఉన్నారు. పేరు మార్పుని ఖండిస్తే జగన్‌కు ఇబ్బంది..అలా అని సమర్ధిస్తే ఎన్టీఆర్ అభిమానులు కొడాలికి దూరమవుతారు. అందుకే ఎటు కాకుండా సైలెంట్ గా ఉండిపోయినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version