షర్మిల, సునీత ఇద్దరూ చంద్రబాబు చేతిలో పావులు అయ్యారని విమర్శలు చేశారు సజ్జల. పవన్ కళ్యాణ్ ది ఒక రాజకీయ పార్టీనా ? టిడిపి కూటమికి చెప్పడానికి ఏమి లేదని మండిపడ్డారు. కూటమి ఇచ్చే హామీలు కూడా గట్టిగా చెప్పడం లేదు…ఇప్పటికే కూటమి మునిగిపోయింది…దివాళా తీసిందన్నారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై వైయస్ షర్మిల, సునీతా మాట్లాడుతున్నారని ఆగ్రహించారు.
అయిదేళ్లలో వైయస్ షర్మిల వివేకా హత్య గురించి మాట్లాడలేదు …ఇప్పుడు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. వైయస్ షర్మిల, సునిత తో చంద్ర బాబు తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారు … బాబు చేతిలో పావులు అయ్యారన్నారు. జగన్ వ్యక్తిత్వం ను దెబ్బతీసే వారిపై కోర్టులను ఆశ్రయిస్తామని హెచ్చరించారు. ఇప్పుడు 60 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి అయ్యిందని… రెండు, మూడు రోజుల్లో పెన్షన్ ల పంపిణీ పూర్తి అవుతుందన్నారు. జనం ఆగ్రహం వ్యక్తం చేస్తుండడంతో పెన్షన్ ల పంపిణీ వ్యవహరం లో టిడిపి మాపై నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. చంద్ర బాబు మీద ప్రజలు కోపంగా ఉన్నారన్నారు. వాలంటరీ ల వ్యవస్థ ను ఎవ్వరూ ఏమి చేయలేరని వివరించారు.