Sajjala ramakrishna reddy: ఏపీ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడంపై సజ్జల సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఏపీ హైకోర్టులో సజ్జల పిటిషన్లు దాఖలు చేశారు. లుక్ అవుట్ నోటీసు క్వాష్ చేయాలని పిటిషన్ దాఖలు చేశారు సజ్జల.
ఈ నెల 25 వరకు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశాలు ఉన్నా LOC ఇవ్వటంపై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు సజ్జల. అయితే.. సజ్జల వేసిన ఈ 2 పిటిషన్లు సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.