సుప్రీంకోర్టులో తెలంగాణ గ్రూపు-1 అభ్యర్థుల పిటిషన్

-

తెలంగాణలో గ్రూపు 1 మెయిన్ పరీక్షలను వాయిదా వేయాలంటూ కొంత మంది అభ్యర్థులు గత కొద్ది రోజుల నుంచి నిరసన, ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా జీవో నెం.29ని రద్దు చేయాలని గ్రూపు 1 అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను కలిసి తమ సమస్యను వివరించారు. అంతకు ముందు హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు వీరి పిటిషన్ ను తిరస్కరించింది.

తాజాగా గ్రూపు-1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ప్రభుత్వం రూల్ ఆఫ్ లా పాటించడం లేదని అభ్యర్థుల తరపు లాయర్ మోహిత్ పేర్కొన్నారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. మరోవైపు గ్రూపు-1 ప్రిలిమ్స్ ప్రశ్న పత్రాల్లో తప్పులు ఉన్నాయంటూ పలువురు దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు సింగిల్ బెంచ్ కొట్టేసింది. ఆ తీర్పును వారు డివిజన్ బెంచ్ లో సవాల్ చేశారు. సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ సోమవారం జరుపుతామని సీజేఐ జస్టీస్ చంద్రచూడ్ వెల్లడించారు. మొదటి కేసుగా ఉదయం 10.30 గంటలు విచారించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు గ్రూపు 1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభం కానుండటం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news