బీజేపీ పై నిప్పులు చేరిగిన స‌జ్జ‌ల

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర బీజేపీ పై వైఎస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌దర్శి స‌జ్జ‌ల రామకృష్ణ రెడ్డి మండి ప‌డ్డాడు. బీజేపీ నాయ‌కులు అబద్దాల‌ను ప్ర‌చారం చేస్తున్నాడ‌ని స‌జ్జ‌ల రామ‌కృష్ణ రెడ్డి అన్నారు. ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం చేసిన ప్ర‌క‌ట‌న లో ఏదైనా అవాస్థవం ఉందా అని ప్ర‌శ్నించారు. దీని పై రాష్ట్ర  బీజేపీ నాయ‌కులు స‌మాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పెట్రోల్ డిజిల్ విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం రూ. 3.20 లక్షల కోట్లు కేంద్రం త‌మ కోటా లో వేసు కుంటుంద‌ని ఆరోపించారు.

ఆ మొత్తాన్ని కూడా అన్ని రాష్ట్రాలకు స‌మానం గా పంపిణీ చేయాల‌ని అన్నారు. అంత మొత్తం లో కేంద్రం తగ్గిస్తే దాని ప్రకారం రాష్ట్రాల్లో తగ్గుతుందని అన్నారు. కేంద్ర ప్ర‌భుత్వం నామ‌ నామమాత్రం తగ్గించి.. పూర్తి స్థాయిలో రాష్ట్రాలు తగ్గించాలి అంటే ఎలా అన్నారు. ఇలా చేస్తే రాష్ట్రాలు ఎలా బతకాలి అని సజ్జ‌ల రామ కృష్ణ రెడ్డి బీజేపీ ప్ర‌శ్నించారు. కాగ తెలుగు రాష్ట్ర ప్ర‌భుత్వాలు కేంద్ర ప్ర‌భుత్వం పై తిరుగుబాటు చేస్తున్నారు. ముఖ్యంగా పెట్రోల్ డిజిల్ ధ‌ర‌ల విష‌యంలో ఈ తిరుగుబాటు స్థాయి పెరుగుతుంది.