ఏపీలో కేవలం పోలీసులకు మాత్రమే జీతాలు – రఘురామ

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులలో కేవలం పోలీసులకు మాత్రమే జీతాలను చెల్లించినట్లు తెలిసిందని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. పోలీసులు 41A నోటీసు ఇచ్చి కూడా అరెస్టు చేస్తారని, నోటీసు ఇచ్చి కూడా ఇవ్వలేదని అంటారని, అందుకే ఎవరికి ఇచ్చినా ఇవ్వకపోయినా పోలీసులకు మాత్రం ఈ ప్రభుత్వం జీతాలను అందజేస్తుందన్నారు. ఐఏఎస్ అధికారుల నుంచి మొదలుకొని సాధారణ ఉద్యోగుల వరకు ఇప్పటి వరకు జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జీతాలు ఇవ్వలేదని ఫైర్ అయ్యారు.

గతంలో 12 వేల కోట్ల రూపాయలు మంజూరు చేసిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారిని ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు కలిసి మరో 10 వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని కోరినట్లు తెలిసిందన్నారు. అయినా ఉద్యోగులకు ఇంకా జీతాలు లేవని, విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్లు లేవని, ఓట్లు విదిల్చే పథకాలకు మాత్రం డబ్బులు కేటాయిస్తున్నారని అన్నారు. బెదిరించే వాలంటీర్లకు, ప్రజలను హింసించే పోలీసులకు మాత్రమే ఈ ప్రభుత్వం ఒకటవ తేదీన జీతాలను అందజేస్తుందని, ఇప్పటి వరకు ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి కేవలం 1800 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించగా, ఇంకో నాలుగు వేల కోట్ల రూపాయలు ఇవ్వాలట అని, అవి ఎప్పుడు ఇస్తారన్నది ప్రశ్నార్థకంగానే మారిందని అన్నారు. రాష్ట్ర ఆదాయం పెరిగిందని, జీడీపీలో దేశంలోనే అగ్రవస్థానంలో ఉన్నామని గొప్పలు పోతున్నప్పటికీ, ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news