జగన్‌ ప్రభుత్వానికి బుద్ది చెప్పి..మా నిధులు ఇప్పించండి – సర్పంచుల ఫోరం

-

జగన్‌ ప్రభుత్వానికి బుద్ది చెప్పి..మా నిధులు ఇప్పించండని.. ఏపీ పంచాయతీ రాజ్ ఛాంబర్ వ్యవస్థాపక అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ కోరారు. గవర్నరుని కలిసి రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదు చేశామని.. 14,15వ ఆర్ధిక సంఘం నిధులను కేంద్రం 2018 నుండి 2022వరకు రూ. 7660 కోట్ల నిధులు పంపిందన్నారు. సర్పంచులకు చెప్పకుండా, ఆమోదం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను దారి మళ్లించిందని ఫైర్‌ అయ్యారు.

సీఎంఎఫ్ ఎకౌంటును దొంగిలించి సొంత పధకాలకు మళ్లించారని.. ఈ విషయాలు తెలుసుకున్న గవర్నర్ కూడా ఆశ్చర్య పోయారన్నారు. 73,74 రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చిన నిధులును రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించిందని.. గ్రామాల అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన నిధులపై రాష్ట్ర ప్రభుత్వం పెత్తనం ఏమిటి..? అని ప్రశ్నించారు సర్పంచులు.

సర్పంచుల ప్రమేయం లేకుండా అకౌంట్ల నుంచి ఎలా మళ్లిస్తారు..? ఇది దొంగతనం కాకపోతే ఎలా‌ చూడాలన్నారు. ఇప్పటికే వివిధ రూపాలలో మా ఆవేదనను తెలిపామని.. గవర్నరును ఇచ్చిన ఫిర్యాదుతో అయినా మా నిధులు మాకు వస్తాయని భావిస్తున్నామని మండిపడ్డారు సర్పంచులు. అప్పటికి స్పందన లేకపోతే రాష్ట్రపతిని కూడా కలిసి వివరిస్తామని.. జగన్ ఇప్పుడైనా స్పందించి మా నిధులు మాకు అప్పగించాలని డిమాండ్‌ చేశారు సర్పంచులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version