AP : నేడు సర్పంచుల ఛలో అసెంబ్లీ కార్యక్రమం

-

AP : నేడు సర్పంచుల ఛలో అసెంబ్లీ కార్యక్రమం ఉంది.నేడు సర్పంచుల ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ తరుణంలోనే… నిన్నటి నుంచే సర్పంచులను హౌస్ అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు. ఏపీ సర్పంచుల సంఘం అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్ ను నిన్నే హౌస్ అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న సర్పంచులను అక్కడే హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.. హై అలర్ట్‌ ప్రకటించారు.

Sarpanchula Chalo assembly program today

కాగా, ఇవాళ అసెంబ్లీలో రెండు బిల్లులు ప్రవేశపెట్టనుంది ఏపీ ప్రభుత్వం. ఇవాళ ఉదయం 9 గంటలకు ఏపీ అసెంబ్లీ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే…పలు శాఖలకు సంబంధించిన అన్యువల్ రిపోర్ట్స్ ను సభ ముందు పెట్టనుంది ఏపీ ప్రభుత్వం. అనంతరం గవర్నర్ ప్రసంగం పై ధన్యవాద తీర్మానం పెట్టనున్నారు.  ఏపీ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ సవరణ బిల్లు- 2024, ఏపీ అడ్వకేట్స్ క్లర్క్స్ వెల్ఫేర్ ఫండ్ సవరణ బిల్లు -2024 ఈ రెండు బిల్లులను ప్రవేశపెట్టనుంది ఏపీ ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Latest news