వసంత కృష్ణ ప్రసాద్ పై మంత్రి జోగి రమేష్ సీరియస్ వ్యాఖ్యలు

-

వైసీపీలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. MLA వసంత కృష్ణ ప్రసాద్  పార్టీపై, సీఎం జగన్ పై సంచలన కామెంట్స్ చేశారు. ఈ విషయంపై మంత్రి జోగి రమేష్ స్పందించారు. ముఖ్యంగా   పార్టీ కోసం తాను ఎంతో కష్టపడితే పెడన వెళ్లిన ఒక నాయకుడు తనను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లిన చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక ఇదే క్రమంలో కొద్దిరోజుల క్రితం మైలవరం వైసీపీ ఇంచార్జ్ గా తిరుపతి యాదవ్ ని పార్టీ అధిష్టానం ప్రకటించడం తెలిసిందే. ఈ పరిణామంతో వసంత కృష్ణ ప్రసాద్ పార్టీ వీడటానికి సిద్ధపడ్డారు. పరిస్థితి ఇలా ఉండగా వసంత కృష్ణ ప్రసాద్ తనపై చేసిన వ్యాఖ్యలకు మంత్రి జోగి రమేష్ స్పందించి ధీటుగా కౌంటర్ ఇచ్చారు. డబ్బుతో రాజకీయాలు చేసే వ్యక్తి వసంత అయితే దమ్ముతో రాజకీయాలు చేసే వ్యక్తిని తానని చెప్పారు. అతను ఒక నమ్మకద్రోహి, చీడ పురుగు, పిరికి పంద అంటూ సీరియస్ కామెంట్స్ చేశారు.2019 ఎన్నికలలో ముఖ్యమంత్రి జగన్ చెప్పటంతో వసంత గెలుపు కోసం పనిచేసినట్లు తెలిపారు. వచ్చే ఎన్నికలలో తిరుపతి యాదవ్ ను గెలిపిస్తానని మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news