వైద్యారోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సత్య కుమార్ యాదవ్….వేద మంత్రోచ్ఛారణల మధ్య సత్య కుమార్ బాధ్యతలను తీసుకున్నారు. ఈ సందర్భంగా వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ….ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 5.30 కోట్ల మందికి కేన్సర్ స్క్రీనింగ్ ఫైలుపై సంతకం చేశానని… కేన్సర్ ముందస్తుగా గుర్తించి వైద్యం అందించేందుకు నివారణ, అవగాహన చర్యలు తీసుకుంటామని చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సంక్షేమం ,సహా ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
ఎయిమ్స్ తరహాలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటామని… ఎయిమ్సులో అందించే సేవలపై అధ్యయనం చేసి తదుపరి సీఎం చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఆరోగ్యాంధ్రప్రదేశ్ ఏర్పాటు కోసం చర్యలు తీసుకుంటామని… డ్రగ్స్ నివారణ, సహా మత్తు బానిసైన వారి కోసం డీఎడిక్షన్ సెంటర్ల ఏర్పాటునకు చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వం వైద్యంపై ఆర్బాటం ఆరాటం తప్ప పేదలకు చేసిందేమీ లేదని… వైద్యం కోసం కేంద్రం నుంచి వచ్చిన 60 నిధులనూ గత ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపణలు చేశారు వైద్య రంగాన్ని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం తన వంతు వాటా ఇవ్వకుండా గత ప్రభుత్వ నిర్లక్ష్యం చేసిందన్నారు.