ఫాదర్స్‌ డే స్పెషల్‌ ఫొటోలు పంచుకున్న చిరంజీవి, అల్లు అర్జున్‌

-

ఇవాళ (జూన్ 16వ తేదీ 2024) ఫాదర్స్ డే. ఈ సందర్భంగా ప్రజలు తమ తండ్రులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. కొందరు గిఫ్టులిస్తూ తమ తండ్రిపై అభిమానం చాటుకుంటుంటే.. మరికొందరు తమ నాన్నపై ఉన్న అభిమానాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. సినీ ప్రముఖులు కూడా నెట్టింట తమ తండ్రితో కలిసి ఉన్న ఫొటో షేర్ చేసి వారికి ఫాదర్స్ డే విషెస్ చెబుతున్నారు.

ఫాదర్స్‌ డేని పురస్కరించుకుని ప్రముఖ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ సోషల్‌ మీడియా వేదికగా స్పెషల్‌ ఫొటోలు షేర్ చేశారు. అభిమానులకు విషెస్‌ తెలిపారు. ‘ప్రతి బిడ్డకు నాన్నే తొలి హీరో’ అంటూ గతంలో తన తండ్రితో కలిసి దిగిన స్టిల్‌ను చిరంజీవి షేర్‌ చేశారు. ‘ప్రపంచంలోని తండ్రులందరికీ.. హ్యాపీ ఫాదర్స్‌ డే’ అంటూ తన తండ్రితో కలిసి దిగిన ఫొటోను అల్లు అర్జున్‌ పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news