ఎన్నికల ముందు రాజీనామా చేసిన వాలంటీర్లు యూటర్న్ తీసుకుంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో రాజీనామా చేసామని, తమను మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలని, వారు తమ ఎమ్మెల్యేలను కోరుతున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
వైసిపి నేతలు తమతో బలవంతంగా రాజీనామాలు చేయించారని వాపోతున్నారు. కాగా ఎన్నికల ముందు 1.08 లక్షల మంది వాలంటీర్లు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.