ఫేక్ సర్టిఫికెట్స్ తయారు చేసిన సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ అరెస్ట్

-

ఏపీలో ఫేక్ సర్టిఫికెట్స్ తయారు చేసిన సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ అరెస్ట్ అయ్యారు. ప్రభుత్వ పథకాలను పొందడానికి ఫేక్ సర్టిఫికెట్స్ తయారు చేయడంతో ముగ్గురు సచివాలయ ఉద్యోగులు, ఓ వాలంటీరును పోలీసులు అరెస్టు చేశారు.

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం దిబ్బపాలెం సెజ్ కాలనీ సచివాలయంలో పనిచేస్తున్న డిజిటల్ సహాయకుడు సుధీర్ పెళ్లి కాకపోయినా డిజిటల్ కీ ఉపయోగించి ఫేక్ మ్యారేజ్ సర్టిఫికేట్ సృష్టించుకున్నాడు.

ఇదే సచివాలయంలో ఉన్న మహిళా పోలీసులు బురుగు, బెల్లి రాజేశ్వరి, పైలా వెంకటలక్ష్మి భర్తలతో కలిసి ఉంటున్నా విడాకులు తీసుకున్నట్లు తప్పుడు పత్రాలు తయారుచేసుకున్నారు. పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు ఈ ముగ్గురు సచివాలయ ఉద్యోగులు, వారికి సహకరించిన వాలంటీర్ చొక్కాకుల నానాజీలపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version